Bharat Biotech Intranasal Covid Vaccine Gets CDSCO Approval for Heterologous Booster Doses: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యాలనే కాదు ఆర్థిక వ్యవస్థలను కూడా నాశనం చేసింది. తగ్గుతుందని అనుకున్న కొవిడ్ మళ్లి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ (చుక్కల మందు) ఇన్‌కొవాక్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బూస్టర్ డోస్‌గా ఈ టీకాను తీసుకునేందుకు అత్యవసర అనుమతులు జారీ చేశారు. ఇన్‌కొవాక్ టీకాను ముక్కు ద్వారా ఇస్తారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఈ టీకాను తీసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు.. బూస్టర్ డోస్‌గా ఇన్‌కొవాక్‌ను తీసుకోవచ్చునని స్పష్టం చేశారు. భిన్న టీకాలు తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు అనుమతి పొందిన మెుట్టమెుదటి నాసల్ వ్యాక్సిన్ ఇన్‌కొవాక్ అని భారత్ బయోటెక్ (Bharat Biotech) వెల్లడించింది.