దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని దివంగత చరణ్‌సింగ్, దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను కూడా అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.