ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ప్రజలను మోసం చేసారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతిశీ(Atishi Marlena) విమర్శించారు. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని(Mahila Samriddhi Yojana) అమలు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆమె అన్నారు. మార్చి 8న అర్హత గల ప్రతి మహిళకు రూ. 2500 అందిస్తామన్న బీజేపీ వాగ్దానం ఏమైందని అతిశీ ప్రశ్నించారు. కాగా, అర్హత ప్రమాణాలను పెట్టి ఢిల్లీ ప్రజలను మోసగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు.
ఈ పథకం రూ.3 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల నుండి, ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన (BPL) వర్గాలకు చెందిన 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 15-20 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిందని ఆమె వెల్లడించారు. ప్రధాని మోడీ(PM Modi) ఎన్నికల ముందు పెద్దపెద్ద హామీలను ఇస్తారు. ఆ తర్వాత వాటిని అమలు చేయరని ఆమె(Atishi Marlena) మండిపడ్డారు. ప్రస్తుతం దేశప్రజలు మోడీ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం లబ్దిదారులను ఎంపిక చేసేందుకు నలుగురు మంత్రులతో కూడిన కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పేరు చెప్పి పథకం అమలు ఆలస్యం చేసేందుకే ఇదొక వ్యూహం అని విరుచుకుపడ్డారు.
లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి.
1. గత ఐదు సంవత్సరాలుగా ఢిల్లీలో నివసించి ఉండాలి.
2. ఆధార్ నంబర్‌తో బ్యాంకు ఖాతాను లింక్ చేయబడి ఉండాలి.