కర్ణాటక ఎన్నికలు.. ధర్మపురి అర్వింద్ కి కీలక బాధ్యతలు

-

కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు మేలో జరగనున్నాయి. కన్నడనాట విజయదుందుభి మోగించేందుకు బీజేపీ మరింత దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా, 189 స్థానాల్లో అభర్ధుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇక ప్రచార కార్యక్రమాలను సైతం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) కి కీలక బాధ్యతలు అప్పగించింది.

- Advertisement -

బీదర్ నియోజకవర్గం(Bidar Constituency) ఎన్నికల ప్రచార బాధ్యతలు అర్వింద్(MP Arvind) కి అప్పగించింది. ఈ విషయాన్ని ఎంపీ అర్వింద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకి ప్రచార బాధ్యతలు అప్పగించిన బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. “కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బీదర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార బాధ్యతలు నాకు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి నడ్డాగారికి, జాతీయ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శ్రీ బీ.ఎల్. సంతోష్ గారికి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ శ్రీ తరుణ్ ఛుగ్ గారికి నా ధన్యవాదాలు. పార్టీ విజయమే లక్ష్యంగా నా శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు అర్వింద్.

Read Also: ఏలేటి బీజేపీలో చేరడంపై బండి సంజయ్ రియాక్షన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...