BJP leader Uma Bharati says Lord Ram, Hanuman not BJP workers: బీజేపీ జాతీయ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి రాముడు పై చేసిన వ్యాఖ్యలు దూమారంరేపుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కమల్ నాథ్ మద్యప్రదేశ్ లో త్వరలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా.. శ్రీరాముడి పై, హనుమంతుడి పై బీజేపీ కి ఎలాంటి పేటెంట్ హక్కులు లేవని అన్నారు. దేవతలను ఏ మతానికి, కులానికి ఆపాదించవద్దని అన్నారు.
రాముడు, హనుమంతుడు మొగలుల, బ్రిటిషర్లు, జనసంఘ్ ఉనికికి ముందే ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు. వారేమి బీజేపీ పార్టీ కార్యకర్తలు కాదని అన్నారు. అంతే కాదు… భోపాల్ లో ఇటీవల లోది వర్గానికి చెందిన ఒక కార్యక్రమంలో ‘ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని’ ఆ స్వేచ్ఛ మీకే ఉందని అనడంతో పార్టీ అసహనం వ్యక్తమవుతోంది. మద్యప్రదేశ్లో మద్యపానం నిషేధం విధించాలని ఈమధ్య మద్యం షాప్ లపై రాళ్లు విసిరి కూడా వార్తల్లో కెక్కారు.
ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఆమె ప్రసంగానికి సంబందించిన ఒక వీడియో ను ట్వీట్ చేసి.. ఉమ భారతి బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారని.. రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం లో భాగంగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.