రైలులో ఓ ఎంపీ గారిని దోమలు కుట్టాయి. అంతే రైల్వే సిబ్బంది కంగారుపడుతూ రైలును ఆపేసి మరీ ఎంపీ ఉన్న బోగీని క్లీన్ చేశారు. ఎంపీ అంటే ఆ మాత్రం మర్యాద ఉండదా?.. అందులోనూ ఆయన అధికారిక బీజేపీ ఎంపీ గారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రాజ్ వీర్ సింగ్(MP Rajveer Singh).. గోమతి ఎక్స్ ప్రెస్ రైలులోని ఏసీ బోగీలో ఢిల్లీ నుంచి లక్నోకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నిద్రిస్తుండగా దోమలు కుట్టాయి.
ఇంకేముంది మా అయ్యగారినే దోమలు కుడతాయా అంటూ ఆయన అనుచరుడు మాన్ సింగ్ ట్విటర్ లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు ఉన్నావ్ స్టేషన్ లో రైలు ఆపి ఎంపీ ప్రయాణించే బోగీ మొత్తం దగ్గరుండి మరీ శుభ్రం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న సాధారణ ప్రయాణికులు తమ ఫిర్యాదుల పట్ల కూడా ఇంతే వేగంగా స్పందిస్తే బాగుటుందని అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు.
Read Also: రోహిత్ శర్మకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ సంచలన ట్వీట్
Follow us on: Google News, Koo, Twitter