ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు CBI నోటీసులు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం(ఏప్రిల్ 16) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీఎం కేజ్రీవాల్‌ను విచారించనున్నట్లు సమాచారం. కాగా, సుమారు రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలు చేస్తూ వాట్సాప్ చాట్‌ స్క్రీన్‌షాట్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద దుమారమే రేగుతోంది. ఇక మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా ఈ వార్తలే వస్తున్నాయి. దీనిపై ఇంకా వేడి చల్లారక ముందే ఢిల్లీ సీఎంకు సీబీఐ నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
Read Also: దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అయితేనే బెటర్: ప్రకాశ్ అంబేద్కర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...