గుకేష్(Gukesh).. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెనమెగిపోతోంది. ఎందుకంటే.. 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్ అయి అతడు సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు ఈ భారత యువ చెస్ గ్రాండ్ మాస్టర్. ప్రస్తుతం అతడిపై ప్రతిఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారిలో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖలంతా గుకేష్‌పై అభినందనల వెల్లువెత్తిస్తున్నారు. గుకేష్ సాధించిన విజయం చూసి యావత్ భారత దేశం గర్విస్తోందని అంటున్నారు.
‘వావ్.. నా హృదయం ఉప్పొంగిపోతోంది. గుకేష్.. ఎంత అద్భుతమైన ఎత్తులు వేశావు. ఈరోజునిన్ను చూసి భారతదేశం గర్వపడుతోంది. 18ఏళ్ల వయసులోనే 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించావు. ప్రపంచ ఛాంపియన్ అయిన రెండో భారతీయుడిగా మరో రికార్డ్‌ను సొంతం చేసుకున్నావ్. అన్నింటికంటే ముఖ్యంగా అతి పిన్న వయసులోనే చెస్ ఛాంపియన్‌గా మారావు. మేరా భారత్ మహాన్’’ అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్(ట్వీట్) చేశారు.
‘‘గుకేష్ నీకు నా హృదయపూర్వక అభినందనలు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా చరత్ర సృష్టించావు. ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశావు. జైహింద్’’ అని రాజమౌళి రాసుకొచ్చారు.
‘‘గుకేష్(Gukesh) నీకు గ్రాండ్ సెల్యూట్. నువ్వు ఓ అద్భుతం. నీ ప్రయాణంలో మరెన్నో విజయాలు అందుకోవాలి’’ అని ఎన్‌టీర్ పోస్ట్ పెట్టారు.
వీరే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం గుకేష్‌పై అభినందనలు గుప్పిస్తున్నారు. దేశం గర్వపడేలా చేశారంటూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తలిపారు. అదేవిధంగా గుకేష్ అసమాన ప్రతిభ, కృషి, సంకల్పాల ఫలితమే ఈ విజయమని ప్రధాని మోదీ.. అభినందనలు తెలిపారు.