రాహుల్ గాంధీపై మరోసారి మండిపడ్డ రాజ్‌నాథ్ సింగ్

0
Rajnath Singh

Central Defence minster Rajnath Singh fires on Rahul Gandhi: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రజల్లో విద్వేషాన్ని నింపుతున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఇమేజ్‌ని తక్కువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో పేదలకు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ మర్యాద, గౌరవంతో రాహుల్ ఆటలాడుతున్నారన్నారు. సరిహద్దుల్లో సైనికులు ధైర్యసాహాసాలు ప్రదర్శిస్తుంటే వారిని ప్రశ్నించడం సమంజసం కాదని సూచించారు. దేశంలో విద్వేషం ఉందని ప్రచారం చేస్తూ.. భారత ప్రతిష్టను కాంగ్రెస్ తగ్గిస్తోందని అన్నారు. భారత్‌లో ఎప్పుడూ మతం, కులం ఆధారిత వివక్షను చూపలేదని, అనేకమంది వీరుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు. జోడోయాత్ర పేరుతో కాంగ్రెస్ దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తోందని ఆరోపించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here