ధరల భారం నుంచి సామాన్యులకు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిత్యం వాడే వంట గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు ఊరట కలిగేందుకు ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. సామాన్యుల ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నంలో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు.
గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 200 తగ్గించించింది. తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధరలు 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రూ.1160 దీనికి డెలివరీ చార్జీలు కలుపుకొని సిలిండర్ ధర రూ.1200 పైగా ఉంది. ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించింది. ఆగస్టు 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1680 వద్ద ఉంది.