Bharat Jodo Yatra: జోడో యాత్రకు బ్రేకులు.. రాహుల్ నిర్ణయమేంటి?

-

Centre asks Rahul Gandhi to Suspend Bharat Jodo Yatra if Covid rules not followed: రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రకు బ్రేకులు పడనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కరోనా గైడ్లైన్స్ జారీచేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూర్ మాండవీయ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కరోనా ప్రోటోకాల్ పాటించాలని అందులో స్పష్టం చేశారు. యాత్రలో ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నందున ప్రజల ఆరోగ్య దృష్ట్యా తప్పక నిబంధనలు పాటించాలని సూచించారు. యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేసుకోవాలని, అలానే మాస్కులు ధరించాలని, శానిటైజెర్లు వాడాలని లేఖ లో పేర్కొన్నారు. కోవిడ్ రూల్స్ పాటించకుండా యాత్రను కొనసాగిస్తే.. ప్రజల ఆరోగ్యానికి ఎదురయ్యే ముప్పును పరిగణలోకి తీసుకొని ఆపేయాలని సూచించారు.

కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా యాత్రను కొనసాగించకుండా నిలిపివేయాలని కేంద్ర మంత్రి మన్సూర్ మాండవీయ రాహుల్ గాంధీకి రాసిన లేఖపై స్పందించిన కాంగ్రెస్ నేత ఆధీర్ రంజన్ చౌదరి. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల్లో ఏ ప్రోటోకాల్ పాటించారని ప్రశ్నించారు. దేశ ప్రజలు భారత్ జోడో యాత్రను(Bharat Jodo Yatra) ఆదరిస్తూ పాల్గొంటున్నారని అన్నారు.

చైనా, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్, జపాన్ తదితర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకవేళ కరోనా కేసులు పెరిగిన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Read Also: చెల్లెమ్మా నువ్వు జైలుకెళ్లడం ఖాయం!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...