దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో భారీ తొక్కిసలాట(Delhi Stampede) సంభవించింది. కుంభమేళకు వెళ్లే భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఘాటుగా స్పందించారు. ఈ తొక్కిసలాటకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేతకానితనం, నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు బలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతో బాధించిందని రాహుల్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Delhi Stampede | క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన రైల్వేశాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్(KC Venugopal) ఎక్స్ వేదికగా ఆరోపించారు. ‘ఇది తీవ్ర విషాదకరం. అక్కడి నుంచి వచ్చిన విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. కేంద్రం పర్యవేక్షణలో, దేశ రాజధానిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పూర్తిగా ప్రభుత్వ అసమర్థతే. మరణించిన, గాయపడినవారి ఖచ్చితమైన గణాంకాలు ఎప్పుడు తెలుస్తాయి?. రద్దీ నియంత్రణకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కుంభమేళా(Maha Kumbh Mela) నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఎందుకు నడపలేదు?’ అని ఆయన ప్రశ్నించారు.