బిగ్ బ్రేకింగ్: చంద్రయాన్ 3 సక్సెస్

-

ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్న అద్భుతం ఆవిష్కృతం అయింది. ఇస్రో ప్రయోగంచిన వ్యోమనౌక చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది. దీంతో ప్రతి ఇండియన్ విజయగర్వంతో సంబురాలు జరుపుకుంటున్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అవకాశాన్ని కల్పించిన ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రశంసలు కురిపస్తున్నారు. చంద్రయాన్ 3 జాబిల్లి పై లాండింగ్ విజువల్స్ ను ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించారు. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ తో పాటు, మాజీ చైర్మన్ కూడా ప్రధాని ఈ ఉత్కంఠ క్షణాలను ప్రధాని మోదీ తో కలిసి వీక్షించారు.

 

- Advertisement -
ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. కోట్లాది మంది ఎదురుచూపులకు తెరపడింది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడిపై ల్యాండర్ విజయవంతగా ల్యాండ్ కావడంపై యావత్ భారతదేశం సగర్వంగా తలెత్తింది. రోవర్‌ వడివడిగా అడుగులేసుకుంటూ చంద్రుడి నేలను తాకింది. ప్రయోగం సక్సెస్ కావడంతో చంద్రుడిపై విజయవంతంగా దిగిన నాలుగవ దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రుడిపై కాలు మోపేలా ల్యాండర్‌ను తీర్చిదిద్దారు. మరోవైపు సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘లూనా-25’ చివరి నిమిషంలో విఫలమైంది. ల్యాండర్‌ను చంద్రుడి చివరి కక్ష్యలోకి మార్చే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3ని చంద్రుని దక్షిణ ధృవంగా విజయవంతంగా దింపేందుకు మరింత కసరత్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...