CJI justice dy chandrachud oath ceremony: సుప్రీం కోర్టు 50వ సీజేఐగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రచూడ్‌తో ప్రమాణం చేయించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10, 2024వరకు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చంద్రచూడ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. హర్వర్డ్ యూనివర్సిటీ నుంచి రెండు అడ్వాన్స్ డ్ లా డిగ్రీలు పొందారు. 39 ఏళ్లకే బాంబే హై కోర్టులో సీనియర్ లాయర్ గా విధులు నిర్వహించారు. అయోధ్య భూవివాదం, గోప్యత హక్కుల్లో కీలక తీర్పుని ఇచ్చారు. కాగా.. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా పనిశారు. ఇప్పుడు ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణస్వీకారం చేశారు