ప్రయాగరాజ్(Prayagraj) లోని మహాకుంభ మేళ పై ఓ నివేదిక కలవర పెడుతుంది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) స్పందించారు. త్రివేణి సంగమంలో నీరు పుణ్య స్నానాలు చేయడానికి వీలు లేకుండా బాక్టీరియా స్థాయి పెరిగిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. ఈ విషయాన్నీ అసెంబ్లీ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. CPCB రిపోర్ట్ పై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూట్ (NGT) .. పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న కొన్ని ప్రదేశాల్లో బాక్టీరియా స్థాయి సాధారణ స్థాయికి మించి ఉందని తెలిపింది. సంగమం వద్ద నీరు తాగడానికి యోగ్యమైనదని ఆయన తెలిపారు.
మహాకుంభ .. మృత్యు కుంభమేళా అంటూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) చేసిన వ్యాఖ్యలకు సీఎం యోగి(Yogi Adityanath) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనవరి 13 న మహా కుంభమేళా ప్రారంభమైన నాటి నుండి మమతా బెనర్జీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆమె ఆరోపణలపై స్పందించిన యోగి.. ఇప్పటివరకు 56 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని.. నిరాధారమైన ఆరోపణలతో వారి విశ్వాసాలతో ఆమె ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన, అలాగే వివిధ రాష్ట్రాల నుండి మహా కుంభమేళా కు వచ్చి మృత్యువాత పడిన వారికి అసెంబ్లీ సాక్షిగా సంతాపం తెలిపారు సీఎం యోగి.