Meta కు రూ.213 కోట్ల జరిమానా.. ఎందుకంటే..

-

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు(Meta) భారీ జరిమానా విధించింది భారత్. వాట్సప్ ప్రైవసీ విధానానికి సంబంధించి 8 ఫిబ్రవరి 2021న తీసుకొచ్చిన అప్‌డేట్‌లో అనౌతిక వ్యాపార విధానాలు అవలంభించినట్లు తేలింది. దీంతో మెటాకు ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) రూ.213 కోట్ల జరిమానాను విధించింది. ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం.. తమ డేటాను ఇతర సంస్థలతో పంచుకోవడానికి వినియోగదారులు తప్పకుండా అంగీకరించాల్సి ఉంటుంది. 25 ఆగస్టు 2016 నాటి విధానం ప్రకారం ఈ విషయంలో వినియోగదారులదే తుది నిర్ణయంగా ఉండేది. అందుకు భిన్నంగా, వినియోగదారుడి భావాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా 2021లో కొత్త విధానాన్ని అమలు చేసింది సంస్థ.

- Advertisement -

ఇలా చేస్తే ఆన్‌లైన్ ప్రకటనల్లో మెటా గుత్తాధిపత్యం వహిస్తోందని సీసీఐ పేర్కొంది. ఇటువంటి పద్ధతులు సరికాదని, తమ వివరాలను మెటా సహా ఇతర సంస్థలతో పంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుడి ఇష్టమని సీసీఐ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ సీపీఐ ఓ ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వాట్సప్ ద్వారా సేకరించిన డాటాను మెటా(Meta) అనుబంధ సంస్థలతో, మెటా కంపెనీ ఉత్పత్తులతో ప్రకటనల నిమిత్తం అయిదేళ్ల పాటు పంచుకోకుండా చూడాలని ఆదేశించింది సీసీఐ.

Read Also: రాజధానిగా ఢిల్లీ కొనసాగాలా.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...