ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. భావోద్వేగంతో డీకే కంటతడి

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) భావోగ్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో విజయం సాధించి ఇస్తానని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)కు మాటిచ్చానని తెలిపారు. తాను జైల్లో ఉండగా సోనియా(Sonia Gandhi) తనను కలిసి భరోసా ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేనని కంటతడి పెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ 140 సీట్లు గెలిచి తీరుతుందని తొలి నుంచి చెబుతున్నానని.. ఇప్పుడు అదే నిజం అయిందన్నారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనేది అధిష్ఠానం చూసుకుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యాలయం తమకు ఆలయం వంటిందని భవిష్యత్ కార్యాచరణ అక్కడే నిర్ణయిస్తామని డీకే(DK Shivakumar) వెల్లడించారు. కాగా కనకపురా నియోజకవర్గం నుంచి బరిలో దిగిన శివకుమార్‌ 20వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

- Advertisement -
Read Also: పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...