కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’కు ముహూర్తం ఫిక్స్

-

Congress to start Hath se Hath Jodo Yatra from January 26: భారత్ జోడో యాత్రతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఛత్తీస్ గఢ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ యాత్ర ఛత్తీస్ గఢ్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ సాగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 నుండి యాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. 2018లో పార్టీకి అంకితభావంతో పని చేసిన 20 మంది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు యాత్రకు సంబంధించిన నిర్వహణ కార్యక్రమాలు చూడనున్నారు.

- Advertisement -

గ్రామాల్లోని ప్రతి వీధిని, ఇంటిని చేరుకునేలా మొత్తంగా 90వేల కిలోమీటర్లు యాత్ర ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. యాత్ర ద్వారా దేశంలోని ఓటర్లను తమ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రమోట్ చేయనుంది. గతంలోనూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ భారత్ జోడో యాత్ర తర్వాత ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ ఉంటుందని ప్రకటించారు. ఈ యాత్ర జిల్లా బ్లాక్, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మూడు దశల్లో ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా యాత్రలో మల్లిఖార్జున్ ఖర్గే కూడా పాల్గొననున్నారు. అంతేకాకుండా వచ్చే నెల రెండో వారంలో రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహించనుంది. దీనిలో ఆర్థిక భద్రతలేమి, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చ, సమస్యలపై తీర్మానాలు చేయనుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...