తీరం వైపు దూసుకొస్తున్న బిపోర్‌జాయ్‌ తుపాన్

-

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను(Biparjoy Cyclone) తీవ్ర రూపం ధరించి తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌపోర్టు వద్ద తీరాన్ని తాకనుంది. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ(India Meteorological Department) తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు ముందస్తు సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు జూన్‌ 15 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తూపాను ప్రభావంతో ఇప్పటివరకు 67 రైళ్లను రద్దు చేశఆరు. అటు తుపాను ముప్పు నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ(PM Modi) అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం బిపోర్‌జాయ్‌ తుపాను(Biparjoy Cyclone) పోరుబందర్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 300 కి.మీలు, ద్వారకకు నైరుతి దిశలో 290 కి.మీలు, జఖౌ పోర్టుకు దక్షిణ-నైరుతి దిశలో 340కి.మీలు దూరంలో ఉంది.

Read Also:
1. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి.. రేవంత్ రెడ్డి ఎమోషనల్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...

Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’

తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth...