ఢిల్లీ నూతన సీఎం(Delhi New CM) ప్రమాణస్వీకారానికి రాంలీలా మైదానం సిద్ధమైంది. ఈ నెల 20న సీఎం ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12: 34 గంటల వరకు కొనసాగనుంది. నేడు సాయంత్రం 6: 15 గంటలకు ఢిల్లీ లోని కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నోకోబడిన MLAలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. లెఫ్టనెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
రాంలీలా మైదానాన్ని అతిధుల కోసం ప్రాంగణంలో మూడు స్టేజిలను ఏర్పాటు చేసారు. మొదటి స్టేజిలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), హోంమంత్రి అమిత్ షా(Amit Shah), లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా(Vinay Kumar Saxena), ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న అభ్యర్థి ఉంటారు. సెకండ్ స్టేజి మత పెద్దలు కోసం, థర్డ్ స్టేజి 200 మంది బీజేపీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ లతో పాటు మిత్రపక్షాలకు సంబందించిన నాయకుల కోసం ఏర్పాటు చేసారు.
ఢిల్లీ సీఎం(Delhi New CM) రేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించిన పర్వేష్ వర్మ ఉన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఓ మహిళను సీఎం గా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ లో నీలం పహల్వాన్, రేఖా గుప్తా, పూనమ్ శర్మ, శిఖా రాయ్ అనే నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో పేర్లతో కూడిన మంత్రివర్గ జాబితాను బీజేపీ నాయకత్వం సిద్ధం చేసింది.
ఈ నెల 5 న వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయకేతం ఎగురవేసి 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీ గడ్డపై పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉంది. శీష్ మహల్ , ఢిల్లీ లిక్కర్ స్కాం అవినీతి ఆరోపణలతో అధికారాన్ని కోల్పోవడంతో పాటు కేజ్రీవాల్ తన సీటు ను సైతం కోల్పోవాల్సి వచ్చింది.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరు కానున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరనున్నారు.