దేశ రాజధాని ఢిల్లీ మధుర రోడ్డులోని ‘ఢిల్లీ పబ్లిక్ స్కూల్'(Delhi Public School) లో ఓ మెయిల్ కలకలం సృష్టించింది. స్కూల్ లో బాంబ్ ఉన్నట్లు బెదిరింపు(Bomb Threat) మెయిల్ రావడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. ఉదయం 8:10 నిమిషాలకు స్కూల్ మెయిల్ కి ఒక వ్యక్తి నుండి బాంబ్ బెదిరింపు మెస్సేజ్ వచ్చింది. దీంతో ఖంగు తిన్న స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్, అంబులెన్సు తో అక్కడికి చేరుకుని తనిఖీ ప్రారంభించారు.
ముందుగా స్కూల్ ఆవరణలో ఎవరూ లేకుండా అందరినీ బయటికి తరలించారు. అనంతరం స్కూల్ ప్రాంగణమంతా బాంబ్ స్క్వాడ్ బాంబు కోసం తనిఖీలు చేపట్టింది. అక్కడ వారికి ఎలాంటి బాంబు, పేలుడు పదార్ధాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. గతంలో సాదిక్ నగర్ లోని ‘ది ఇండియన్ స్కూల్’ కి కూడా స్కూల్ లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు((Bomb Threat)) రావడంతో పోలీసులు, బాంబు స్క్వాడ్ వెతికారు. అక్కడ కూడా ఎలాంటి పేలుడు ఆనవాళ్లు దొరకలేదు. అది కేవలం బెదిరించేందుకే మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.