కేంద్ర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసన, ప్రభుత్వ, న్యాయ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేస్తూ సామాన్యుడి హక్కులను సంరక్షించాలని, రాజకీయంగా హీట్‌ను పెంచే చర్చలకు అవి దూరంగా ఉండాలని ధన్‌ఖడ్ సూచించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేక ఒత్తిళ్ల మధ్య విధులను నిర్వర్దిస్తుంటాయని గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసి కూడా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు కేంద్ర సంస్థల స్థైర్యాన్ని నీరుగార్చేలా ఉన్నాయని అన్నారు. అలాంటి సంస్థలను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టడం కీలకంగా మారింది. ఇంతకీ సుప్రీంకోర్టు ఏమందంటే..
కేంద్ర సంస్థలు ఇతరులు వాటివైపు వేలెత్తిచూపడానికి వీలు లేకుండా పనిచేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ ఇస్తూ.. సీబీఐ అనే కేంద్ర దర్యాప్తు సంస్థ పంజరంలోని చిలుకలా పనిచేస్తున్న ముద్రను వదిలించుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) ఈ వ్యాఖ్యలు చేశారు.