చట్టసభల్లో మహిళా రిజర్వేషన్.. బిల్లు వివరాలు, విశేషాలు

-

బీజేపీ సర్కార్ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొందితే దేశంలోని చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ మహిళా బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదింపజేసుకున్నా పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ తరవాతే ఇది అమలులోకి రానుంది. ఈ ప్రక్రియ 2027 తరవాతే కొలిక్కి వస్తుంది. 2029 పార్లమెంట్ ఎన్నికలలో రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందితే, దేశ రాజకీయాలలో విప్లవాత్మక మార్పులు సంభవించే అవకాశముంది. కేంద్రం ఈ బిల్లుకు ‘నారీశక్తి వందన్’ అని నామకరణం చేసింది.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘నారీశక్తి వందన్’ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడం హర్శనీయమన్నారు. మహిళల భాగస్వామ్యంతో ప్రజా స్వామ్యం మరింత బలపడుతుందన్నారు. మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తొలుత ప్రతిపాదించింది తామేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అన్నారు. గతంలోనే తాము పార్లమెంటుకు మహిళా బిల్లును తీసుకొచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఏది ఏమైనా ఈ బిల్లును తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల సాధికారత దిశగా ఎప్పుడూ ఆలోచిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ మహిళా బిల్లును స్వాగతిస్తున్నామన్నారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు ముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. రహస్యంగా ఇలా తీసుకురావడానికి బదులు అన్ని పార్టీలు అంగీకరిస్తున్నందున ఏకాభిప్రాయం వచ్చేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో 2010 మార్చి 9న లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టామమని గుర్తు చేశారు.

ఏఐసీసీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య రాజ్యసభ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఓబీసీలకు చోటు కల్పించకపోవడాన్ని ఖర్గే తప్పుబట్టారు. ఓబీసీలలోని వెనుకబడినవర్గాలవారికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వెనుకబడినవర్గాల మహిళల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉందని, ఇదే విషయాన్ని పసిగట్టిన రాజకీయ పక్షాలు ఈ రిజర్వేషన్ల అంశాన్ని లేవదీసాయన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమన్నారు. వెనుకబడినవర్గాల వారి ప్రాధాన్యతను చట్టసభలో పెంచి వారి అభివృద్ధికి తోడ్పడాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు. ఖర్గే బిల్లును వ్యతిరేకించినట్లుగా మాట్లాడడం విడ్డూరమన్నారు. ఇదే సమయంలో అధికార పక్షాలు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డాయి. మహిళా బిల్లును బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. 33 శాతానికి బదులు 50 శాతం మహిళలకు కేటాయించి ఉంటే బాగుండేదని అన్నారు.

బిల్లు విశేషాలు:

లోక్ సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 82. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఆ సంఖ్య కాస్తా 181 కి చేరుతుంది. ఢిల్లీలో కూడా 239 ఏఏ ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఢిల్లీలో ఉన్న 70 స్థానాలలో 23 స్థానాలు మహిళలకు లభించనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి కానున్నాయి. ఈ బిల్లులో నిబంధనల ప్రకారం 15 యేళ్లు మహిళా రిజర్వేషన్లు కొనసాగనున్నాయి. అనంతరం మరోమారు బిల్లుకు చట్టరూపం కల్పించుకునే అవకాశం ఉంది.

ఈ బిల్లులోని అంశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండవు. ఈ 33 శాతంలోనే వారికీ సీట్లను కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు 84 సీట్లు ఎస్సీలకు సీట్లను కేటాయిస్తే, అందులో 33 శాతం అంటే, 28 సీట్లు ఆ వర్గం మహిళలకే లభిస్తాయి. ఎస్టీ మహిళలకు కూడా 33 శాతం కేటాయించనున్నారు. లోక్ సభలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అనంతరం 412 సీట్లు మిగులుతాయి. జనరల్ స్థానాలలో 137 సీట్లు మహిళలకు పోతాయి. నాన్ రిజర్వుడ్ స్థానాలలోనూ మహిళలు పోటీపడొచ్చు.

లోక్ సభ, అసెంబ్లీ లలో మాత్రమే మహిళలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ వ్యవస్థ ఉన్న రాష్ట్రాలలో మహిళా రిజర్వేషన్ వర్తించదు. మహిళా బిల్లు చట్టరూపం దాల్చినా అమలులో ఆలస్యం అవుతుంది. లోక్ సభ సీట్ల పెంపు అనంతరం రిజర్వేషన్ అమలయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పలు రాష్ట్రాలలో అసెంబ్లీ భాగస్వామ్యంలో 15 శాతం మహిళలకు దక్కడం లేదు. 19 రాష్ట్రాల్లోని 10 శాతం మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంది. ప్రస్తుత పార్లమెంటులో 543 మంది సభ్యులుండగా, 78 మంది మాత్రమే మహిళా సభ్యులున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 15 శాతం మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్లే.

మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్న రాష్ట్రాలు:

హర్యానా: 10%

బీహార్ : 10.70%

పంజాబ్: 11.11%

ఉత్తరాఖండ్: 11.43%

ఢిల్లీ: 11.43%

ఉత్తరప్రదేశ్: 11.66%

రాజస్థాన్: 12%

జార్ఖండ్: 12.3%

పశ్చిమ బెంగాల్: 13.70%

ఛత్తీస్గఢ్: 14.44%

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...