Devendra Fadnavis | షిండేను కలిసిన ఫడ్నవీస్.. ప్రమాణస్వీకార వేడుకల కోసమేనా..?

-

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై దాదాపు ఉత్కంఠ వీడింది. మహారాష్ట్రాకు ఫడ్నవీసే(Devendra Fadnavis) కాబోయే సీఎం అని ప్రచారం జరుగుతుండగా.. బీజేపీ అధిష్ఠానం కూడా అదే నిర్ణయానికి వచ్చిందని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ నెల 5వ తేదీన మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకార వేడుక జరగనుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఆయన నివాసంలో ఫడ్నవీస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలక అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. సీఎం అభ్యర్థిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాకముందే వీరిద్దరు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థి, ఇతర మంత్రిత్వ శాఖల కేటాయింపుల అంశంపై మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. కాగా ఈ అంశాలపై తాజాగా మహాయుతి కూటమిలో ఒక క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. ఫడ్నవీస్‌(Devendra Fadnavis)ను సీఎంగా, షిండే(Eknath Shinde), పవార్‌లకు(Ajit Pawar) డిప్యూటీ సీఎంలుగా నియమించాలని కూటమి నిశ్చయించుకున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ రావాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.

Read Also: మీ లైఫ్ కు మీరే కెప్టెన్ 
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...