Maharashtra CM | మహారాష్ట్ర నూతన సీఎం అభ్యర్థిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. సీఎం అభ్యర్థిని మహాయుతి కూటమి(Mahayuti Alliance) ప్రకటించింది. డప్యూటీ సీఎం అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి సీఎంగా ఎవరిని ప్రకటించాలన్న అంశంపై మహాయుతి కూటమి చర్చలు చేస్తూనే వచ్చింది.
తాజాగా ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. అందరూ ఊహించిన విధంగానే ఫడ్నవీస్(Devendra Fadnavis).. రాష్ట్ర సీఎంగా పగ్గాలు పట్టనున్నారు. ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా ఉన్న ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde).. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. కాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి(Maharashtra CM) ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరగనుంది. ఈసారి కూడా మహారాష్ట్రకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. వారు షిండే, అజిత్ పవార్(Ajit Pawar)గా తెలుస్తోంది. బుధవారం జరిగే బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశంలో సీఎం అభ్యర్థి ఎంపిక జరగనుంది.