కర్ణాటకలో విజయం కాంగ్రెస్‌దే.. 141 సీట్లు గెలుస్తాం: డీకే

-

మరో నాలుగు రోజుల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Elections) కాంగ్రెస్ పార్టీ 141 సీట్లు తప్పకుండా గెలుచుకుంటుందని కేపీసీసీ(KPCC) చీఫ్ డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ సాధిస్తామని తెలిపారు. సీఎంగా అధిష్టానం ఎవరిని నియమించినా కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం లోక్‌సభ ఎన్నికల్లో మార్పునకు పునాది అన్నారు. అలాగే బీజేపీ మేనిఫెస్టోపైనా ఆయన విమర్శలు చేశారు.

- Advertisement -

Karnataka Elections | మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)ను అంతం చేయడానికి చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ ఇంఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా(Randeep Surjewala) సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. బీజేపీ హత్యా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) స్పందించారు. సూర్జేవాలా ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేపడతామని ఆయన తెలిపారు.

Read Also: ఫోన్‌పేలోకి UPI లైట్‌ ఫీచర్‌ వచ్చేసింది.. ఎలా వాడాలో తెలుసా?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...