ఉత్తర భారతదేశాన్ని భూకంపం(Earthquake) భయపెట్టింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూకశ్మీర్‌లోని దోడాలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై 5.4తీవ్రతంతో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, చండీగడ్ రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు సంభవించాయి. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కి.మీల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.