Maharashtra – Jharkhand | ఎన్నికలంటే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు భారీ మొత్తంలో నగదు పంచడం అనేది చాలా సాధారణ ప్రక్రియలా మారిపోయింది. దానిని అరికట్టడం కోసం అధికారులు ఎక్కడిక్కడ చెక్‌పోస్ట్‌లు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో ఝార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్క రూపాయి కూడా లోపలికి బయటకు రవాణా కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాటితో పాటుగానే ప్రజలను ప్రలోభ పెట్టే ఇతర అంశాలపై కూడా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో చేసిన తనిఖీల్లో నవంబర్ 6 వరకే వందల కోట్ల రూపాయాల నగదును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Maharashtra – Jharkhand | నవంబర్ 6 వరకు రూ. 558.67 కోట్లు విలువైన నగదు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీజ్ చేసిన వాటిలో రూ.92.47 కోట్లు నగదు కాగా, రూ.52.76 కోట్ల విలువైన మద్యం, రూ.68.22 కట్ల విలువన మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఉచితాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు అధికారులు. అంతేకాకుండా మొత్తం సీజ్ చేసిన రూ. 558.67 కోట్ల విలువైన తాయిలాల్లో మహారాష్ట్రాలో రూ.280 కోట్లు, ఝార్ఖండ్ రూ.158 కోట్ల విలువైన తాయిలాలు ఉన్నట్లు తెలిపారు. అధికారుల. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీజ్ చేసిన మొత్తం 3.5 రెట్లు అధికమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.