కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)కి ఈ డి జలకిచ్చింది. భూ కుంభకోణం కేసు చార్జ్ షీట్ లో ఆమె పేరును చేర్చింది. హర్యానాలో 5 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. 2006 లో జరిగిన ఈ భూ లావాదేవీలో ప్రియాంక ప్రమేయం ఉందని అభియోగాలున్నాయి. ఇదే విషయాన్ని ఈడీ చార్జ్ షీట్ లో ప్రస్తావించింది.
వివరాల్లోకి వెళితే.. 2006 లో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా హర్యానా(Haryana)లోని అమీపూర్ గ్రామంలో 40 ఎకరాల భూమిని కొన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా భూమిని కొనుగోలు చేశారు. తిరిగి 2010 లో అదే భూమిని పహ్వాకి అమ్మేశారు. అయితే 2006 లోనే పహ్వా ద్వారా అమీపూర్ గ్రామంలో ఇంటిని కొన్నారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఆమె కూడా 2010 లో అదే ఇంటిని పహ్వాకి అమ్మేశారు.
కాగా.. భూమిని, ఇంటిని కొనుగోలు చేయడానికి జరిపిన ఆర్థిక లావాదేవీలన్నీ విదేశాల నుంచి వచ్చాయని ఈడీ ఆరోపించింది. NRI బిజినెస్ మ్యాన్ థంపి, బ్రిటన్ జాతీయుడైన సుమిత్ చద్దా ల ద్వారా.. ప్రియాంక, రాబర్ట్ వాద్రా భూములు కొనుగోలు చేసి మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే వారిద్దరి పేర్లను చార్జ్ షీట్ లో నమోదు చేసింది.