బైజూస్(BYJUs) లెర్నింగ్ యాప్ అధినేత రవీంద్రన్ బైజూ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలతో పాటు ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టినట్లు ఈడీ ప్రకటించింది. తనిఖీల్లో భాగంగా పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 2011లోనే ప్రారంభమైన బైజూస్(BYJUs) కంపెనీ 2023 వరకు రూ.28వేల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు పొందినట్లు పేర్కొంది. అందులో రూ.9,754కోట్లను విదేశీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పింది. ఇందులో అవకతవకలు జరిగాయని ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పింది. ఈ నేపథ్యంలో రవీంద్రన్(Raveendran Byju) కు పలు మార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదంది. అందుకే ఆయన ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించామని ఈడీ వెల్లడించింది.
Read Also: ఎకరానికి రూ.30 వేలు ఇవ్వండి.. ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Follow us on: Google News, Koo, Twitter