దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు సమయం ఆసన్నమైంది. రేపు(శనివారం) మధ్యాహ్నం షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్‌లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్లు బాధ్యతలు చేపట్టడంతో షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. కాగా గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించగా.. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు.