ISRO Chairman |ఎలాన్ మస్క్‌పై ఇస్రో ఛైర్మన్ ప్రశంసలు..

-

అంతరిక్ష రంగంలో తన మార్క్ చూపిస్తున్న వ్యక్తి ఎలాన్ మస్క్(Elon Musk). ఎప్పటికప్పుడు వినూత్ర ప్రాజెక్ట్‌లు చేపడుతూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. తాజాగా ఎలాన్ మస్క్‌పై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్(ISRO Chairman Somanath) ప్రశంసలు కురిపించారు. ఇస్రోతో పాటు మస్క్ కూడా తన విజయాలతో ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IIIT) 13వ స్నాతకోత్సవంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎలాన్ మస్క్ తన రాకెట్‌లతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారని, యూరప్ సహా రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నారని ఆసక్తికిగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఎలాన్ మస్క్ సాధిస్తున్న విజయాలను ప్రతి విద్యార్థు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

- Advertisement -

‘‘ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదగాలంటే వాణిజ్యం, వనరుపైనా ఆధారపడితే కుదరదు. స్వయం సాంకేతికతపైన కూడా దృష్టి సారించి, అందులో ముందుకు సాగాలి. అంతరిక్ష రంగంలో ఇస్రో పురోగతి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ వేగాన్ని కొనసాగించడానికి నిరంతర కృషి, ఆవిష్కరణలు అవసరం. యువ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు దేశాన్ని ముందుకు నడిపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించాలి’’ అని ISRO Chairman Somanath కోరారు.

Read Also: ఒత్తిడిని తట్టుకోలేకపోయాం.. టెస్ట్ ఓటమిపై రోహిత్ రుసరుసలు
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...