Exicom – Hero Electric: హీరో ఎలక్ట్రిక్‌తో ఎక్జికామ్ కీలక ఒప్పందం

-

Exicom Partners With Hero Electric To Supply Battery Management Systems For EVs:ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్‌ ఎక్జికామ్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఎలక్ట్రిక్ ఛార్జర్లు, లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసే ఎక్జికామ్ కంపెనీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా హీరో ఎలక్ట్రిక్‌కి చెందిన ద్విచక్ర వాహనాల కోసం బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ(BMS) సౌకర్యాలను అందించనున్నట్టు ఎక్జికామ్ పేర్కొంది. బీఎంఎస్ అంటే ఈవీ బ్యాటరీల్లోని ఓల్టేజ్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా కరెంట్ సరఫరాను సూచించే విధానం. చార్జింగ్, బ్యాటరీ సామర్థ్యం, భద్రతా పరిమితులను లెక్కించడంలో బీఎంఎస్ సహాయపడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో జరిగే అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు ఈ బీఎంఎస్ విధానం ఎంతో దోహదపడుతుంది. పర్యావరణానికి ప్రయోజనకరమైన ఈవీ బ్యాటరీ మేనేజెంట్ విధానం కోసం దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ హీరో ఎలక్ట్రిక్‌తో జతకావడం సంతోషంగా ఉందని ఎక్జికామ్ ఎండీ అనంత్ నహతా అన్నారు. హీరో ఎలక్ట్రిక్ ఎక్జికామ్ నుంచి ఏటా 5 లక్షల యూనిట్ల బీఎంఎస్‌లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. వినియోగదారులకు మెరుగైన భద్రతా, పనితీరు అందించేందుకు బీఎంఎస్ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ సింగ్ పేర్కొన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...