ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్

-

ఒడిశా(Odisha)లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్ ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. బాలేశ్వర్‌ జిల్లా బహనాగ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 50మంది  ప్రయాణికులు మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దాదాపు 300 మంది గాయాలపాలవగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Odisha |సమాచారం అందుకున్న అధికారులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బాలాసోర్ కు 40 కిలోమీటర్లు దూరంలో ఈ ఘటన సంభవించింది. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286కు ఫోన్‌ చేయాలని అధికారులు తెలిపారు.

Read Also:
1. ఆఫీసుకు వస్తాడు కానీ.. డ్యూటీ చేయకుండా టాయిలెట్‌లోనే ఉంటాడు 
2. కేసీఆర్ సర్కార్ కు RS ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...