కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూశారు. 92 ఏళ్ల ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రం మన్మోహన్ సింగ్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనని హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆయన గురువారం రాత్రి 9:51 గంటలకు మరణించినట్లు ధృవీకరిస్తూ ఎయిమ్స్ వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతితో ఆయన కుటుంబంలో, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పలు రాజకీయ నేతలు ఆయన మృతిపై దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తీసుకువచ్చిన పలు ఆర్థిక సంస్కరణల్లో నాటి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ కాలం భారత ప్రధానులుగా కొనసాగిన వారిలో మన్మోహన్ కూడా ఒకరు.
Read Also: బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు
Follow us on: Google News, Twitter, ShareChat