Terror Attack | జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడులు రెచ్చిపోయారు. ఆర్మీ వాహనాలను టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడ్డాడు. బారాముల్లాలో గుల్మార్గ్‌లోని బోట్‌పత్రిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు స్థానకులు మొత్తం నలుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వం మారిన రోజుల వ్యవధిలోనే ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఫోకస్ పెట్టిన ఆర్మీ.. ఉగ్రవాదులను కనుగొనడం కోసం రంగంలోకి దిగింది. ఆర్మీ వాహనంపై జరిగిన దాడిని తేలికగా తీసుకునేది లేదని కూడా ఆర్మీ వర్గాలు అంటున్నాయి.
Terror Attack | ప్రభుత్వం మారిన కొన్ని రోజులకే ఈ దాడి జరగడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికారం వచ్చీ రాగానే కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమి ఉగ్రవాదులను పోషించే పనిలో పడ్డాయని, ఆర్మీ వాహనాలపైనే ఈ తరహాలో దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని జమ్మూకశ్మీర్ బీజేపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అదే సమయంలో అధికారం రాకపోవడంతో తమ పార్టీ, కూటమిపై బురదజల్లడం కోసం బీజేపీనే ఈ దాడిని చేయించిందంటూ ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి.