దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కాలుష్య కట్టడికి బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 15 ఏళ్ళు పైబడిన వెహికల్స్ కి ఫ్యూయల్ నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేయనున్నారు. కాలుష్య నియంత్రణ పై పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా(Manjinder Singh Sirsa) అధికారులతో సమావేశమయ్యారు.
15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ పంపుల వద్ద గాడ్జెట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సిర్సా తెలిపారు. అలా గుర్తించిన వాహనాలకు ఫ్యూయల్ అందదని తెలిపారు. ఎత్తైన భవనాలు, హోటళ్ళు, వ్యాపార సముదాయాల్లో, ఢిల్లీ(Delhi) విమానాశ్రయంలో యాంటీ-స్మోగ్ గన్‌లు, గాడ్జెట్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 2025 నాటికీ 90 శాతం CNG తో నడిచే బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు అయన వెల్లడించారు.
శీతాకాలంలో పొగమంచు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. స్కూల్స్ ను వారాల తరబడి మూసివేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా శీతాకాలంలో ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుపోతున్నట్లు తెలిపారు. మా ప్రభుత్వం ఢిల్లీ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందని మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు.