Gali janardhan reddy announcess new party kalyana rajya pragati paksha: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటకలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బిజెపి(BJP) కీలక నేత గాలి జనార్ధన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి అందరినీ షాప్ కి గురి చేశారు. పనిలో పనిగా పార్టీ పేరు కూడా ప్రకటించేశారు గాలి జనార్ధన్ రెడ్డి. కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడంతో కర్ణాటక రాజకీయాలు ఒకసారిగా చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవలే గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) గంగావతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బళ్లారిలో చక్రం తిప్పిన ఆయన అక్కడ హవా తగడంతోనే గంగావతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఆయన బీజేపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టడానికి కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి బిజెపి ఆయనను దూరంగా ఉంచుతోందట. పార్టీ కీలక కార్యక్రమాలకు సైతం ఆయనకు ఆహ్వానం అందడం లేదట. ఈ నేపథ్యంలోని మనస్థాపానికి గురైన గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చర్చించుకుంటున్నారు.