Goods Train Accident at korai Railway station in Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్స్ రైలు ఫ్లాట్‌ఫామ్ మీదకు దూసుకువచ్చింది. ఘటనలో 10 బోగీలు బోల్తా పడ్డాయి. ఫ్లాట్‌పామ్‌పై తమతమ ట్రైన్ల కోసం నిరీక్షిస్తున్న ముగ్గురు ప్రయాణీకులపై బోగీలు పడటంతో, అక్కడికక్కడే వారు మృతి చెందారు. వెయిటింగ్ హాల్ సమీపంలో ప్రమాదం జరగటంతో.. రైలు బోగీల కింద మరికొంత మంది ఉండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మార్గంలోని పలు రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు.
Goods Train: ఫ్లాట్‌ఫామ్ మీదకు దూసుకువచ్చిన గూడ్స్.. ముగ్గురు మృతి
-