Omicron :గుజరాత్‌లో కొత్త ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BF-7 గుర్తింపు

-

Omicron:కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ వైరస్‌ ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యాలనే కాదు ఆర్థిక వ్యవస్థలను కూడా నాశనం చేసిన విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడి వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ దేశలు ఊపిరి పీల్చుకున్నాయి అయినప్పటికి అక్కడక్కడ వైరస్ కేసులు వచ్చినా అంత ప్రభావం లేక పోవడంతో మాస్క్‌ల వినియోగం కూడా తగ్గించేశాం.. అయితే ఈ సారి ఈ మహమ్మారి కోత్త వెరియంట్‌‌గా రూపాంతరం చెందింది. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌‌ పరిశోధకులు ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BF-7 మొదటి కేసును గుర్తించారు. ఈ సందర్భంగా రీసెర్చ్ సెంటర్‌ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మాధవి జోషి మింట్‌ మాట్లాడారు. ప్రజలు ఎవరు భయాందోళనలకు గురికావద్దని, దేశంలోని ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. అయితే.. చైనాలో ఇటీవల రెండు కొత్త ఓమిక్రాన్ (Omicron)సబ్-వేరియంట్స్ BF-7, BA.5.1.7 కనుగొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్‌ డాక్టర్‌ ఆంథోనీ ఫాసీ కూడా గతంలో వ్యాక్సిన్‌లతో శరీరంలో ఏర్పడ్డ రోగనిరోధక శక్తిని సైతం తట్టుకునే కొత్త వేరియంట్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే..

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...