ట్రైన్లో ప్రయాణం చేస్తూ హత్యలు, దోపిడీలు, అత్యాచారలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్‌ను(Serial Killer) పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. ఈ సైకో హంతకుడు.. తెలివిగా ట్రైన్లలో చివర ఉండే వికలాంగుల బోగీలోకి ఎక్కి అక్కడి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. 35రోజుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తిరుగుతూ.. ఐదు రాష్ట్రాల్లో ఐదు హత్యలకు పాల్పడ్డాడు. అతడి కోసం గాలింపులు చేస్తున్న గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు.. ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. అతడి కోసం పలు బృందాలుగా విడిపోయి గాలింపులు చేశామని, ఎట్టకేలకు తమకు అతడు సికింద్రాబాద్‌లో లభించాడని వల్సాద్ ఎస్పీ కరణ్‌రాజ్ సింగ్ వాఘేలా(Karanraj Singh Vaghela) వెల్లడించారు.
‘‘ఈ సీరియల్ కిల్లర్ పేరు భోలో కరమ్‌వీర్ జాట్. అతడు హర్యానాకు చెందిన వ్యక్తి. గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లో అనేక నేరాలు చేశాడు. ఇటీవల రైళ్లలో హత్యలు, మానభంగాలు, దోపిడీలకు బాగా అలవాటు పడి సీరియల్ కిల్లర్(Serial Killer)గా మారిపోయాడు. పోలీసుల విచారణలో అతడి నేరాల చిట్టా అంతా బయటపడింది. ఆదివారం రోజు సికింద్రాబాద్(Secunderabad)లోని ఓ రైలు వికలాంగుల బోగిలో మహిళ మృతదేహం లభించింది. దీంతో వల్సాద్ పోలీసులకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు సమాచారం ఇచ్చారు. కాగా ఆ హత్య తానే చేసినట్లు కరమ్‌వీర్ అంగీకరించడంతో అతడిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని కరణ్‌రాజ్ తెలిపారు.