Haryana | పెళ్లి కాని వారికి పెన్షన్.. సీఎం కీలక నిర్ణయం

-

వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న మహిళలు, పురుషులకు పెన్షన్ ఇచ్చేలా కొత్త పథకాన్ని తీసుకువచ్చేందుకు హర్యానా(Haryana) ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) కర్నాల్ లో జరిగిన జన్ సంవద్ కార్యక్రమంలో వెల్లడించారు. పెళ్లి కాని 45-60 ఏళ్ల వయసు వారికి నెలవారి పెన్షన్ ఇచ్చేలా ఓ పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. నెల రోజుల్లోగా ఈ పథకం అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే ఈ పథకం కింత ఎంత పెన్షన్ ఇస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రం(Haryana)లో అమలు అవుతున్న వృద్ధాప్య పెన్షన్ ను రాబోయే ఆరు నెలల్లో రూ.3 వేలకు పెంచబోతున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు.

- Advertisement -
Read Also:
1. నన్ను కలవడానికి కేసీఆర్‌కు టైమ్ లేదా: కేఏ పాల్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...