Corona Update |భారత్ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంపై కేంద్రం స్పందించింది. దేశంలో ఇప్పటివరకూ 214 రకాల కరోనా వేరియంట్లను గుర్తించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ తెలిపారు. వైరస్ పై వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా తర్వాత గుండెపోటులు ఎక్కువ కావడంపై ఆయన స్పందిస్తూ హార్ట్ స్ట్రోక్స్ కు కరోనాకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే దానిపై పరిశోధనలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. రెండు, మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఆకస్మాత్తుగా యువత గుండెపోటుతో మరణించడం చూస్తూనే ఉన్నామని.. అందుకు గల కారణాలను గుర్తించడానికి ఈ పరిశోధనలు ఉపయోగపడతాయన్నారు మాండవీయ.
- Advertisement -
వంటకు కావాల్సిన వాటి కోసం కింద క్లిక్ చేయండి
Read Also: వామ్మో.. బెంగళూరులో ఇంటి అద్దె రూ.50వేలు