Lok Sabha | అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడివేడి చర్చలు

-

లోక్‌సభ(Lok Sabha)లో అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలు మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని అనుకున్నారంతా. కానీ రాహుల్ ఆయన స్థానంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చ ప్రారంభించారు. చర్చ మొదలు పెడుతూనే కేంద్రంపై గొగోయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎప్పుడూ వన్ ఇండియా అంటూ మాట్లాడే కేంద్రం ఇప్పుడు రెండు మణిపూర్‌లను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. అందులో ఒకటి కొండ ప్రాంతంలోని మణిపూర్, మరొకటి లోయ ప్రాంతంలోని మణిపూర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఓవైపు మణిపూర్(Manipur) తగలబడిపోతుంటే ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించలేదో తెలపాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Lok Sabha | గౌరవ్ మాట్లాడిన అనంతరం బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చర్చ ప్రారంభించడానికి సిద్ధంగా లేరేమోనని.. ఆయన ఆలస్యంగా మేలుకుని ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అనర్హతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపైనా దూబే స్పందించారు. న్యాయస్థానం ఈ కేసులో తుది తీర్పు ఇవ్వలేదని, కేవలం సూరత్ కోర్టు(Surat Court) తీర్పును నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. మణిపూర్‌లో చెలరేగిన హింస వల్ల తాను బాధితుడినయ్యానని, తన అంకుల్ అక్కడ చాలా బాధలు అనుభవించారని తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టంచేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచి మణిపూర్ ఘటనలపై ప్రధాని స్పందించాలంటూ పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. అయితే అధికార పక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉభయసభల్లోనూ వాయిదాల పర్వం నడిచింది. చివరికి.. జులై 26న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది విపక్షం. ఈ ప్రభుత్వం పట్ల తమకు విశ్వాసం పోయిందని, దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఇలాగైనా మోదీ మణిపూర్‌ ఘటనపై మాట్లాడతారని భావిస్తోంది. మరోవైపు విపక్షాల ఆందోళనల మధ్యే.. ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకుంది.

అయితే ఎన్​డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్​కు వచ్చి మణిపూర్​ హింసపై మాట్లాడతారని ఇండియా కూటమి చెబుతోంది. ప్రస్తుతం అధికార NDA కూటమికి 330కి పైగా ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమికి 141 మంది సభ్యుల బలం ఉంది. మరో 60మంది ఎంపీలు ఏ కూటమిలో లేరు.

Read Also: విజృంభిస్తోన్న కొత్త వేరియంట్.. ప్రపంచ దేశాలు అప్రమత్తం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...