అదానీ(Adani), అంబానీ(Ambani)లపై తాను చేస్తున్న వ్యాఖ్యలను కొందరు తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తునస్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తానని వివరించారు. కానీ బీజేపీ(BJP) వాళ్లు మాత్రం తానేం చేసినా దానిని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని బీజేపీ.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే తనను టార్గెట్ చేస్తోందని, తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించడానికి బీజేపీ తెగ కష్టపడుతోందని విమర్శలు చేశారు. భారత దేశంలో కొందరు వ్యాపారవేత్తలు గుత్తాధిపత్యం చలాయిస్తున్నారని తాజాగా ఓ వార్త పత్రికకు రాసిన వ్యాసంలో రాసుకొచ్చారు.
‘‘ఓ విషయంపై నేను స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నారు. బీజేపీలో కొందరు నన్ను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. ఉద్యోగాల కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీతత్వానికి మద్దతు ఇస్తా. నేను వ్యాపార వ్యతిరేకిని అస్సలు కాదు. గుత్తాధిపత్యానికి, మార్కెట్ నియంత్రణ శక్తులకు మాత్రమే వ్యతిరేకం. కేవలం వేళ్లపై లెక్కేసే సంఖ్యలో వ్యక్తులు ఆధిపత్యం చలాయించడం విరుద్ధం. మేనేజిమెంట్ కన్సల్టెంట్‌గా నా కెరీర్‌ను ప్రారంభించా. వ్యాపార విజయానికి అవసరమైన అంశాలను అర్థం చేసుకునే సామర్థ్యం నాకుంది’’ అని Rahul Gandhi అన్నారు.