రాజస్థాన్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21(IAF MiG 21) యుద్ధ విమానం కుప్ప కూలిపోయింది. సూరత్‌గఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ పారాచూట్ సాయంతో కిందకు దూకేశాడు. అయితే ఈ విమానం హనుమాన్‌గఢ్ జిల్లా బహ్లోల్‌లో ఓ ఇంటిపై కూలింది. దీంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పైలట్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సాధారణ శిక్షణలో భాగంగా మిగ్-21 విమానం కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ప్రమాద కారణాలపై విచారణ చేపడతామని పేర్కొంది.
IAF MiG 21 |ఇంటిపై కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు మహిళలు మృతి
-