మహా కుంభమేళాకు(Maha Kumbh Mela) ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఉత్సవం జరగనుంది. మహాకుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం చలికాలం కారణంగా ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉండటంతో మహా కుంభమేళాకి(Maha Kumbh Mela) వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: రూటు మార్చిన మహేష్ బాబు..
ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ వచ్చే భక్తుల సౌకర్యార్థం వాతావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో ప్రత్యేక పేజీని రూపొందించారు. ఈ వెబ్ పేజీలో ప్రతి 15 నిమిషాలకు ప్రయాగ్ రాజ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకోవచ్చని ఐఎండి డైరెక్టర్ మనీష్ తెలిపారు.
ఈ వెబ్ పేజీలో రోజుకు రెండుసార్లు వాతావరణ సూచనలు కూడా అందిస్తామని ఆయన వెల్లడించారు. దీనికోసం మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించినట్లు మనీష్ పేర్కొన్నారు.