Tea Day |ప్రస్తుత రోజుల్లో చాయ్ వాడకం ఏ లెవెల్‌లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. మనసుకు బాధ అనిపించినా.. సంతోషం అనిపించినా.. తలనొప్పి వచ్చినా.. ఏదైనా విషయంలో టెన్షన్ పడినా అందరూ వెంటనే కావాలని కోరుకునేది ‘టీ’. ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం(International Tea Day) సందర్భంగా చాయ్ లవర్స్ టీ ప్రత్యేకతను స్మరించుకుంటున్నారు. టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం టీ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5వేల సంవత్సరాల క్రితం చైనాలో మొదటిసారిగా ‘టీ’ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
Read Also: నిద్రలో గురక పెడుతున్నారా? ఈ సమస్యని చిన్నదిగా చూడకండి..
Follow us on: Google News, Koo, Twitter