ప్రమాదంలో చంద్రయాన్-3 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ సంచలన వ్యాఖ్యలు 

-

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ కావడంతో చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిందని భారతీయులంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల ల్యాండర్, రోవర్లకు పలు ప్రమాదాలు పొంచి ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రుడిని ఇప్పటికే ఎన్నో ఖగోళ వస్తువులు వచ్చి ఢీ కొట్టాయని.. అవి అత్యంత వేగంగా వచ్చి ఢీ కొడితే ల్యాండర్, రోవర్లు పూర్తిగా ధ్వంసమైపోతాయని వివరించారు.

- Advertisement -

అదే జరిగితే చంద్రయాన్-3 మిషన్ పూర్తిగా నాశనమైపోతుందన్నారు. అలాగే చంద్రుడిపై ఉన్న పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు కమ్యూనికేషన్ నిలిచిపోవడం వంటివి జరుగుతాయన్నారు. భూమిపై కూడా ప్రతి గంటకు లక్షల కొద్ది ఖగోళ వస్తువులు వస్తుంటాయని.. కానీ భూమిపై ఉన్న వాతావరణం వల్ల ఆ వస్తువులన్నీ కాలి పోతుంటాయన్నారు. ప్రస్తుతానికి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని.. ఇప్పటి వరకు అన్నుకుట్టుగానే తమ పనిని నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Naga Chaitanya | సాంప్రదాయబద్దంగా నాగచైతన్య-శోభిత వివాహం..

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) మూడు ముళ్ల బంధంలోకి...

Revanth Reddy | రాష్ట్ర అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం: రేవంత్ రెడ్డి

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలనను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని...