Exit Polls | వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. దూరం పాటించిన కాంగ్రెస్..

-

Exit Polls | మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాగుతోంది. దీంతో అక్కడ రాజకీయ పరిస్థితులు వాడివేడిగా మారాయి. ఎన్నికల పోటీ నువ్వా నేనా అన్నటలు ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుంది అన్న అంశంపై బెట్టింగ్‌లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్‌పై కూడా అసలు ఫలితాల తరహాలోనే చర్చలు మొదలయ్యాయి. ఇవి ఎవరికి అనుకూలంగా ఉండనున్నాయన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్ చర్చలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎగ్జిట్ పోల్స్ చర్చలకు తమ పార్టీ పూర్తిగా దూరం పాటించనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠను మరింత అధికం చేశాయి. హర్యానా తరహాలోనే ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయా అన్న తరహాలో చర్చలు జరుగుతున్నాయి.

- Advertisement -

Exit Polls ఎలా ఉన్నాయంటే..

ఝార్ఖండ్(Jharkhand)

* పీపుల్స్ పల్స్: ఎన్డీయే 46-58, ఇండియా కూటమి 24-37, ఇతరులు 6-10

* మాట్రిజ్: ఎన్డీయే 42-47, ఇండియా కూటమి 25-30, ఇతరులు 1-4

* టైమ్స్ నౌ-జేవీసీ: ఎన్డీయే 40-44 ఇండియా కూటమి 20-40, ఇతరులు 1-1

* యాక్సిస్ మై ఇండియా: ఎన్డీయే 25, ఇండియా కూటమి 53, ఇతరులు 3

* దైనిక్ భాస్కర్: ఎన్డీయే 37-40, ఇండియా కూటమి 36-39, ఇతరులు 0-2

మహారాష్ట్ర(Maharashtra)

* పీపుల్స్ పల్స్: మహాయుతి-182, ఎంవీఏ-97, ఇతరులకు 9 స్థానాలు

* చాణక్య : మహాయుతి 152-160, ఎంవీఏ 130-138, ఇతరులు 6-8

* మాట్రిక్ : మహాయుతి 150-170, ఎంవీఏ 110-130, ఇతరులు 8-10

* సీఎన్ఎన్-న్యూస్18: మహాయుతి-154, ఎంవీఏ-128, ఇతరులు 6

* లోక్ శాహీ మరాఠీ: మహాయుతి- 128-142, ఎంవీఏ- 125-140, ఇతరులు 18-23

* దైనిక్ భాస్కర్ : మహాయుతి 125-140, ఎంవీఏ -135-150, ఇతరులు 20-25

* పీ-మార్క్: మహాయుతి 137-157, ఎంవీఏ 126-146, ఇతరులు 2-8

Read Also: గ్యాంగ్‌స్టర్లకు అడ్డాగా ఢిల్లీ.. సీఎం కీలక వ్యాఖ్యలు
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...